BDK: కొత్తగూడెంలో జరిగిన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల ఎంపిక దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి ఇవాళ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ విస్తరణకు కృషి చేసిన, కష్టపడిన వారికే పదవులు దక్కుతాయని ఎంపీ అభయమిచ్చారు. ఎన్నికలకు ముందు నుంచి పని చేసిన వారిని మర్చిపోము అని, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు ముందు కలిసికట్టుగా పనిచేయాలన్నారు.