KMM: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసే బాణసంచా దుకాణాలలో వ్యాపారులు నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని అదనపు డీసీపీ ప్రసాద్ రావు అన్నారు. ఇవాళ ఖమ్మం కమిషనరేట్లో లాటరీ పద్దతిలో వ్యాపారులకు దుకాణాలు కేటాయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. SR&BGNR కళాశాల మైదానంలో 86, పెవిలియన్ మైదానంలో 42 ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.