HYD: ధూమపానం వీడితే వాళ్లే నిజమైన జీవిత విజేతలు అని పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత, పౌర సరఫరాల సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహాశీల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు. మార్చి 12వ బుధవారం జాతీయ ధూమపాన వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కాచిగూడలో మాట్లాడుతూ.. పొగాకు ఉత్పత్తుల బారిన పడి ఎందరో తమ జీవితాల్ని ఛిద్రం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.