SKLM: ఒత్తిడి ఉపశమనానికి వ్యాయామం ఎంతగానో దోహదపడతాయని డీఎస్పీ శేషాద్రి అన్నారు. ఎచ్చెర్ల ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసు కార్యాలయంలో ఆదివారం “సండేస్ ఆన్ సైకిల్” కార్యక్రమాన్ని డీఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ మేరకు ముందుగా యోగా నిర్వహించగా, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి రోజు ఒక గంట వ్యాయామం చేయాలని డీఎస్పీ పిలుపునిచ్చారు.