సౌత్ ఇండస్ట్రీపై బాలీవుడ్ నటి డైసీ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ కంటే సౌత్‌లో బొడ్డు, నడుమును ఎక్కువగా చూపిస్తారని తెలిపారు. హీరోయిన్ల నడుము, పొట్టపై కెమెరా క్లోజప్ షాట్లు ఎక్కువగా పెట్టడం అన్ని ఇండస్ట్రీలో సాధారణమేనని, కానీ సౌత్‌లో అవి చాలా ఎక్కువగా ఉంటాయని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.