ఏపీలోని వైజాగ్ లో కొత్తగా ఏర్పాటైన ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ ను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ నేపథ్యంలో వచ్చే డిసెంబర్ లోపు పరిపాలన విభాగం మొత్తం విశాఖకు షిఫ్ట్ అవతుందని జగన్ తెలిపారు.
చంద్రబాబు ఆరోగ్యం ప్రమాదకరంగా ఉందని.. ఆయన ప్రాణాలకు ఏం జరిగినా సీఎం జగన్ బాధ్యత వహించాలని ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు.
మాజీ సీఎం చంద్రబాబు హెల్త్ బులిటెన్‌ను వైద్యులు విడుదల చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని స్పష్టంచేశారు.
ఏపీలోని ఎన్నికల్లో వైసీపీని ఢీకొట్టేందుకు టీడీపీ, జనసేన సిద్ధమయ్యాయి. ఉమ్మడిగా పలు కార్యక్రమాలు చేపట్టడం కోసం సమన్వయ కమిటీని ఏర్పాటు చేశాయి.
ఏపీలో టీడీపీ నేతలు పలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. జైల్లో ఉన్న చంద్రబాబును విడుదల చేయాలని కోరుతూ బాబుతో నేను, న్యాయానికి సంకెళ్లు వంటి కార్యక్రమాలు నిర్వహించారు.
చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా నేడు నిర్వహించే న్యాయానికి సంకెళ్లు కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొనాలని నారా లోకేష్, బ్రహ్మణి, భువనేశ్వరి కోరారు. ఈ సందర్భంగా ఈరోజు రాత్రి 7 నుంచి 7.05 నిమిషాల సమయంలో చేతులకు రిబ్బన్ లేదా గుడ్డను కట్టుకుని ఈ నిరసనలో పాల్గొనాలని పేర్కొన్నారు.
విజయవాడ దుర్గమ్మను ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులు దర్శించుకున్నారు.
రాజమండ్రి జైలులో చంద్రబాబు ఉంటున్న గదిలో ఏసీ ఏర్పాటు చేయాలని జైళ్ల శాఖ అధికారులకు ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీచేసింది.
ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు కుమారుడు లోకేశ్ నుంచి ముప్పు ఉందని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకు గల కారణాలను కూడా వివరించారు.
ఏపీలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల నేతలు విమర్శల దాడులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఏపీ బీజేపీ అధినేత్రి దగ్గుబాటి పురంధేశ్వరి అధికార పార్టీ నేతలకు అదిరిపోయే సవాల్ చేసింది. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చంద్రబాబు నాయుడుకు మద్ధతుగా పాదయాత్ర చేసేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలో అక్టోబర్ 24 నుంచి 33 రోజుల పాటు చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
వచ్చే ఎన్నికల్లో సీఎం ఆయనే అంటూ వేణు స్వామి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
టీడీపీ యువనేత నారా లోకేశ్ ఢిల్లీ నుంచి హుటాహుటిన విజయవాడకు వచ్చారు.
వైఎస్ విజయమ్మకు పెను ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కాన్వాయ్ లోని కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఏ ప్రమాదం వాటిళ్లలేదు.
ఇటివల ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(jagan mohan reddy) జనసేన అధినేత పవన్ కల్యాణ్(pawan kalyan) పెళ్లిళ్ల గురించి మళ్లీ చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) స్పందించారు. సీఎం ఎప్పుడు చుసినా పవన్ వ్యక్తిగత విషయాలు మాట్లాడి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇలా దిగజారి మాట్లాడుతున్న సీఎంకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారని ధీమ...