TPT: నాయుడుపేట పట్టణంలో సంచార జాతుల షాపులను గుర్తుతెలియని వ్యక్తులు తగలబెట్టారు. వీటిని తగలబెట్టింది ఓ పలుకుబడి కలిగిన వ్యక్తే అని వారు అనుమానిస్తున్నారు. ఇవి తగల పడటంతో సంచార జాతుల వారు వీధిన పడ్డారు. ఇలా తమ గుడిసెలను తగలబెట్టడం ఎంతవరకు సమంజసమని…? వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.