JGL: ఎండపల్లి(M) పాతగూడూర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలకు చెందిన విద్యార్థులు గోల్డ్ మెడల్ సాధించారు. పెద్దపల్లి జిల్లాలో జరిగిన జాతీయస్థాయి అండర్-14 విభాగంలో పాతగూడూర్కు చెందిన విద్యార్థులు సిహెచ్. సంజన, వై. రేఖ, సిహెచ్. వైష్ణవిలు గోల్డ్ మెడల్ సాధించారు. కరాటే మాస్టర్ చిరంజీవి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులను మంగళవారం అభినందించారు.