ASR: జిల్లాలో పీఎంఎవై, పీఎం జన్ మన్ పథకాల కింద చేపట్టిన ఇళ్ళ నిర్మాణాలు వేగవంతమయ్యేలా ఎంపీడీవోలు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దినేష్ కుమార్ మంగళవారం ఆదేశించారు. సాంకేతిక కారణాలు చూపించి ఆలస్యం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇప్పటికే ప్రగతిలో ఉన్న నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. లేకుంటే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు.