VZM: మహిళలు, చిన్న పిల్లలపై అఘాయిత్యాలకి పాల్పడిన కేసులలో దర్యాప్తు వేగవంతం చేసి న్యాయస్థానాల ద్వారా కఠిన శిక్షలు విధించడం జరుగుతుందని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. విజయనగరం జిల్లా పరిధిలో చిన్నారులపై జరిగిన ఆఘాయిత్యాల (POCSO) కేసుల్లో నిందితులకు 3 నుండి 6 నెలలలోపే శిక్షలు ఖరారు చేయడంలో విజయం సాదించిన జిల్లా పోలీసులను అభినందించారు.