BDK: నకిలీ మొక్కలు నాటి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆయిల్ఫామ్ రైతులు ఆయిల్ ఫెడ్ జనరల్ మేనేజర్ సుధాకర్ రెడ్డికి, ఇంఛార్జ్ డీ.ఓ నాయుడు రాధా క్రిష్ణకు మంగళవారం వినతిపత్రం అందించారు. 2016 నుంచి 2022 మధ్య కాలంలో ఆయిల్ఫామ్ తోటలు నాటిన వాటిల్లో దాదాపుగా 50 శాతం పైగా కాపు రాలేదని తెలిపారు.