NTR: కూటమి ప్రభుత్వం కరెంటు ఛార్జీలను విపరీతంగా పెంచిందని సీపీఎం సెంట్రల్ సిటీ కార్యదర్శి రమణారావు అన్నారు. మంగళవారం విజయవాడ ఎక్సెల్ ప్లాంట్లో ఉన్న జీ ప్లస్ 3 అపార్ట్మెంట్లో ప్రజా చైతన్య యాత్ర నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కరెంట్ బిల్లులు ట్రూ ఆఫ్ ఛార్జీలతో ప్రజలపై పెనుభారం మోపారని విమర్శించారు.