ప్రకాశం: టంగుటూరు మండలంలోని తూర్పు నాయుడుపాలెంలో మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు వర్ధంతి సందర్భంగా.. ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళా, మెడికల్ క్యాంపును రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వీరాంజనేయస్వామి ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, జిల్లా టీడీపీ అధ్యక్షుడు నూకసాని బాలాజీ తదితరులు పాల్గొన్నారు.