GNTR: మార్కెట్లోకి రెడీమేడ్ దుస్తులు రావడంతో టైలర్ వృత్తి గణనీయంగా తగ్గిపోయిందని సీనియర్ టైలర్ భావనారాయణ అన్నారు. మంగళగిరి ఆటోనగర్ రుచి హోటల్ ఆవరణలో ఆదివారం అమరావతి టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశం జరిగింది. సమావేశంలో అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అసోసియేషన్ అధ్యక్షునిగా షేక్ నాగుల్ మీరా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.