ప్రకాశం: మార్కాపురంలో అనుమానాస్పదంగా తిరుగుతూ కనబడిన వ్యక్తిని మార్కాపురం ఎస్సై సైదుబాబు అదుపులోకి తీసుకున్నారు. అతనిని విచారణ చేయగా.. సదరు వ్యక్తిది సింగరాయకొండ మండలం సోమరాజుపల్లి గ్రామానికి చెందిన శేషమ్మ కుమారుడు శ్రీహరిగా గుర్తించారు. 20 సంవత్సరాల కిందట తప్పిపోయిన అతను తన కుమారుడేనని తల్లి తెలిపింది. ఇన్నేళ్ల తర్వాత తమ కుమారుడి ఆచూకీ లభించడంపై ఆమె ఆనందం వ్యక్తం చేస్తూ పోలీసులకు కతజ్ఞతలు తెలిపింది.