NDL: రబీ సీజన్‌కు సంబంధించి గోస్పాడు మండలంలో 4,507 మంది రైతులు 15,297 ఎకరాల్లో పంటల సాగుకు సంబంధించి, ఈ పంట నమోదు చేసుకున్నట్లు వ్యవసాయ అధికారి స్వప్నిక రెడ్డి తెలిపారు. మంగళవారం పసురపాడు, గోస్పాడు RSKల్లో ప్రదర్శించిన ఈ పంట ముసాయిదా జాబితాను పరిశీలించారు. రైతులు జాబితాను పరిశీలించి పేరు, విస్తీర్ణం, పంట, నీటి వసతి పొరపాట్లను సరి చేసుకోవాలన్నారు.