కృష్ణా: రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే రాము అన్నారు. గుడ్లవల్లేరు మండల పీఏసీఎస్ త్రిసభ్య కమిటీ చైర్మన్గా వెనిగండ్ల నాగేశ్వరరావు, డైరెక్టర్లుగా నవాబు,చింతల సూర్యచంద్రరావు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే రాము నూతన కమిటీకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు పాల్గొన్నారు.