BPT: చీరాల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మాలకొండయ్య శనివారం బాపట్లలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ వినోద్ కుమార్‌ను కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే మాలకొండయ్య కలెక్టర్‌ను కోరారు. ఈ సందర్భంగా తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని కలెక్టర్ వినోద్ కుమార్ హామీ ఇచ్చారు.