NLR: చేజర్ల మండలం ఆదురుపల్లి సచివాలయంలో పంచాయతీ కార్యదర్శి రఫీ ఆధ్వర్యంలో గ్రామస్థులతో ప్రత్యేక సమావేశం జరిగింది. గ్రామంలో పందుల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆయన పందుల పెంపకందారులను అక్కడకు పిలిపించి సమస్యపై చర్చించారు. తరచూ రోడ్లపై, ఇళ్ల వద్ద పందుల సంచారం కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని రఫీ వివరించారు.