KRNL: ఉపాధ్యాయులకు 30 శాతం మధ్యంతర భృతి కల్పించాలని ఎస్టీయూ నాయకుడు వీర చంద్ర యాదవ్ డిమాండ్ చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రెండు నెలల పెండింగ్ డీఏలు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలవుతున్నా ఉపాధ్యాయుల సమస్యలు తీరడం లేదన్నారు. దసరా పండుగ కానుకగా మధ్యంతర భృతి ఇవ్వాలన్నారు.