NGKL: అచ్చంపేట పట్టణ కేంద్రంలో వివిధ ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రైవేటు ఉపాధ్యాయులను ఎమ్మెల్యే వంశీకృష్ణ శనివారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గురువులు కేవలం అక్షరాలు నేర్పేవారు మాత్రమే కాదని, మన జీవితాలకు సరైన మార్గం చూపించే వారని వెల్లడించారు. ఉపాధ్యాయుల నిబద్ధత ప్రశంసనీయమన్నారు.