ములుగు మండల పరిధిలో 163 జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ములుగు మండలం పందికుంట స్టేజి సమీపంలో రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్లు గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.