NZB: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని DMHO రాజశ్రీ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యులు, సిబ్బంది హాజరు రిజిస్టర్లు, ఆస్పత్రి రికార్డులు పరిశీలించారు. రికార్డుల నిర్వహణ సక్రమంగా లేక పోవడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.