VZM: 2024-25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి కంటకాపల్లి పంచాయతీకి రూ.81.83 లక్షలు వెచ్చించినట్లు డీఆర్పీ పి.వీరభద్రుడు తెలిపారు. శనివారం సచివాలయంలో నిర్వహించిన సామాజిక తనిఖీ గ్రామ సభ జరిగింది. పించన్లు, ఉపాధి హామీ పనులపై ఇంటింటికీ వెళ్లి జరిగిన దానిపై గ్రామస్తులను ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మదీనా లక్ష్మి, సచివాలయం కార్యదర్శి ప్రియాంక పాల్గొన్నారు.