SRCL: బోయినపల్లి మండల కేంద్రంలోని ఒక పాత ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ రైస్‌ను శనివారం అధికారులు సీజ్ చేశారు. తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకు అక్రమ రేషన్ బియ్యం విక్రయిస్తున్న, కొనరావుపేట మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన పెద్దగంటి అంజయ్యను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి, రేషన్ బియ్యం సీజ్ చేసినట్లు ఎస్ఐ రమాకాంత్ తెలిపారు.