AP: కూటమి ప్రభుత్వం కులాల మధ్య అంతరాలను సృష్టించి లబ్ది పొందాలని కుటిల యత్నం చేస్తోందని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. శెట్టిబలిజ సామాజిక వర్గానికి కుల ధ్రవీకరణ పత్రం మంజూరు చేసే సమయంలో ముందుగా గౌడ అని చూపించి ఆ తర్వాత బ్రాకెట్లో శెట్టిబలిజ అని నమోదు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. బీసీలకు అండగా నిలిచింది వైసీపీ ప్రభుత్వమే అని అన్నారు.