MNCL: బెల్లంపల్లి మండలం చర్లపల్లి శివారు పంట పొలాల్లో విద్యుత్ తీగలు కిందికి వంగి ప్రమాదకరంగా వేలాడుతున్నాయి. విద్యుత్ తీగలు కిందికి వంగి పంట పొలాలకు దగ్గరగా వేలాడుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదాలు జరిగే అవకాశాలున్నా విద్యుత్ అధికారులు పట్టించుకోవడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి విద్యుత్ తీగలను సరి చేయాలని కోరారు.