NDL: మహానంది నుంచి గాజులపల్లె మార్గంలో ప్రయాణించే ప్రయాణికులు జాగ్రత్తలు పాటించాలని మహానంది ఎస్సై రామ్మోహన్ రెడ్డి సూచించారు. మహానంది సమీపంలోని ఎంసీ ఫారం గ్రామం వద్ద పాలేరు వాగు రోడ్డెక్కి ప్రవహిస్తుందని.. వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నీళ్లు ఎక్కువగా ఉంటే స్థానికుల సహకారం తీసుకోవాలని ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు.