శ్రీకాకుళం జిల్లాలోని పలు స్టేషన్ల మధ్య ట్రాక్ మరమ్మతుల కారణంగా బ్రహ్మ పూర్-విశాఖ మధ్య నడిచే ప్యాసింజర్‌ను కొద్ది రోజుల పాటు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. నంబర్ 58531, 58532 గల ట్రైన్‌ను ఈ నెల 15 నుంచి 27 వరకు రద్దు చేస్తున్నామని తూర్పు కోస్తా రైల్వే తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికులు గమనించాలని కోరారు.