VSP: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సృష్టి కేసుకు సంబంధించి నగరంలో రెండు చోట్ల సిట్ అధికారులు, తెలంగాణ సిట్ బృందం తనిఖీలు చేపట్టారు. సృష్టి కార్యాలయం, ఆసుపత్రిలలో రాత్రి 12గంటల వరకు తనిఖీలు కొనసాగాయి. జిల్లా వైద్య అధికారుల నుంచి పూర్తి సమాచారం సేకరించారు. ఈ మేరకు విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.