NTR: విజయవాడలోని న్యూ రాజేశ్వరిపేట కాలనీలో తాగునీటి సరఫరాపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డయేరియా ప్రబలిన ఈ ప్రాంతంలో తడి, పొడి చెత్తను తీసుకెళ్లే ట్రాక్టర్లలోనే మినరల్ వాటర్‌ను సరఫరా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీనివల్ల మరింతగా బ్యాక్టీరియా వ్యాప్తి చెందే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.