SRD: జహీరాబాద్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ మహమ్మద్ అస్లాం ఫారుకి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈనెల 15, 16 తేదీల్లో కళాశాలకు వచ్చి అడ్మిషన్ తీసుకోవాలని చెప్పారు. ఇదే చివరి అవకాశం అని పేర్కొన్నారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.