PLD: దాచేపల్లి పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పీఎం శ్రీ పథకం కింద రూ. 69.70 లక్షల అభివృద్ధి పనులను నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆదివారం ప్రారంభించారు. అనంతరం ఆ స్కూల్ ఆవరణలో ఆర్క్ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని సందర్శించారు.