NZB: నగరంలోని పద్మశాలి విద్యార్థి వసతిగృహం ఎన్నికలు రసవత్తరంగా జరుగుతున్నాయి. నగరంలోని పద్మశాలి హైస్కూల్లో ఆదివారం ఉదయం నుంచి పోలింగ్ ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో శంఖం గుర్తు నుంచి అధ్యక్షుడిగా ఎస్సార్ సత్యపాల్, సూర్యుడు గుర్తు నుంచి దికొండ యాదగిరి, ఏనుగు గుర్తు నుంచి కొండి రమేష్‌లు బరిలో నిలిచారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు 75 శాతం పోలింగ్ నమోదయింది.