NGKL: జిల్లాలో గడిచిన 24 గంటలో వివిధ ప్రాంతాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా బిజినపల్లి మండల కేంద్రంలో 70.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. యంగంపల్లి 48.5, కొండారెడ్డిపల్లి 45.0, పాలెం 35.5, మంగనూర్ 32.8, తెలకపల్లి 29.5, కిష్టంపల్లి 17.0, తోటపల్లి 15.0, ఉప్పునుంతల 7.5, కొల్లాపూర్ 11.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.