TG: నీటి పారుదలశాఖ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఢిల్లీలో ఈ నెల 23 నుంచి 25 వరకు కృష్ణా జలవివాదాల ట్రైబ్యునల్ విచారణ చేయనుంది. ఈ క్రమంలో ట్రైబ్యునల్ ముందు వినిపించాల్సిన వాదనలపై రేవంత్ చర్చించారు. కృష్ణా జలాల్లో న్యాయమైన వాటాను సాధించి తీరాలని అధికారులను ఆదేశించారు. నికర, మిగులు, వరద జలాల్లో చుక్కనీరు కూడా వదులుకునేది లేదన్నారు.