W.G: నర్సాపురంలో ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించడమే తన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అన్నారు. శనివారం ఆయన పట్టణంలోని 7, 8వ వార్డులలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. వాటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.