KDP: కమలాపురం మండలంలోని దేవరాజుపల్లి గ్రామంలో ఇవాళ మామిడి తోటలో జూదం ఆడుతున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు పరార్ అయ్యారు. వారి వద్ద నుంచి పేక ముక్కలు, మొబైల్ ఫోన్లు, మూడు ద్విచక్ర వాహనాలు, రూ. 20,500 నగదు స్వాధీనం చేసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు.