TG: కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన నీట్-పీజీ రాష్ట్ర ర్యాంకర్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తం 7,179 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. టాప్-5 ర్యాంకుల్లో ముగ్గురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. కాగా, రాష్ట్ర కోటా పీజీ కౌన్సెలింగ్ త్వరలో ప్రారంభం కానుంది.