మహబూబ్నగర్ పురపాలక పరిధిలోని శివశక్తి నగర్లో పారిశుధ్యం పడకేసింది. మున్సిపల్ సిబ్బంది గత కొంతకాలంగా ఎటువంటి పారిశుధ్య చర్యలు చేపట్టకపోవడంతో నాలాలన్నీ నిండుకున్నాయి. మురుగు కాలువలు కూడా నిర్మించకపోవడంతో దుర్గంధం వెదజల్లుతోంది. ఈ విషయమై ప్రజాప్రతినిధులకు మున్సిపల్ అధికారులకు చెప్పిన వారు పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు.