NZB: త్వరలోనే నిజామాబాద్ ముంబై మధ్య వందే భారత్ రైలు నడపడానికి ప్రయత్నిస్తున్నట్లు పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ తెలిపారు. శనివారం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాకు వందేభారత్ రైలు మంజూరు కోసం చేసిన వినతి పెండింగ్లో ఉందని, దీనిపై ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.