NGKL: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సత్తా చాటుతుందని అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. మహేశ్వరం మండల కేంద్రంలో శనివారం బీజేపీ ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాజిక న్యాయం అభివృద్ధి ప్రజాస్వామ్య పరిరక్షణ జరగాలంటే భారతీయ జనతా పార్టీ గెలవాలన్నారు.