CTR: వీకోట మండలం కృష్ణాపురం వద్ద మిలాద్ నబీ వేడుకలు ముస్లిం మైనార్టీలు శనివారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు, కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ ఛైర్మన్ శ్రీనివాసులు హాజరయ్యారు. నిర్వాహకులు ఆయనకు స్వాగతం పలికారు. వారికి జడ్పీ ఛైర్మన్ శుభాకాంక్షలు తెలియజేశారు.