MNCL: బెల్లంపల్లి షెడ్యూలు కులాల బాలుర వసతి గృహాన్ని శనివారం మంచిర్యాల జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు సీహెచ్ దుర్గాప్రసాద్ పరిశీలించారు. విద్యార్థులకు వండుతున్న భోజనాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. వసతి గృహంలో కల్పిస్తున్న సౌకర్యాలను కళాశాలల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.