BDK: దుమ్ముగూడెం మండలంలో పెద్దర్లగూడెం నారాయణరావు పేట డైలీ వేజ్ వర్కర్ల సమ్మెకు వ్యవసాయ కార్మిక సంఘం భద్రాచలం డివిజన్ కార్యదర్శి దాసరి సాయన్న శనివారం సంఘీభావం తెలియజేశారు. వారు మాట్లాడుతూ.. గిరిజన ఆశ్రమ హాస్టల్లో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్లకి 10 నెలల జీతాలు వెంటనే విడుదల చేయాలని గతంలో ఇచ్చిన జీతాలను పాత పద్ధతిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు.