ADB: వాతావరణ పరిస్థితులతో అన్నదాతలు పడరాని పాట్లు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం వారికి కనీసం యూరియాను అందించే పరిస్థితిలో లేదని మాజీ మంత్రి, BRS జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడారు. భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని పేర్కొన్నారు.