SRPT: కోదాడకు చెందిన సూక్ష్మ కళాకారుడు తమలపాకుల సైదులు ప్రజా సేవ రత్న అవార్డును అందుకున్నారు. శనివారం చిలకలూరిపేటలో జయ జయ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవంలో, చిలకలూరిపేట వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్ షేక్ కరీముల్లా చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా సైదులును పలువురు అభినందించి, హర్షం వ్యక్తం చేశారు.