NLG: SLBC కాలనీ సమీపంలో జిల్లా మహిళా సమాఖ్య, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో, రూ.5 కోట్లు వ్యయంతో ఏర్పాటు చేయనున్న. మహిళా శక్తి పెట్రోల్ పంపు పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పురుషులతో పాటు, మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు.