NLG: ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని DVKనియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కిన్నెర హరికృష్ణ అన్నారు. దేవరకొండ ఏడో వార్డులో ‘నా ఓటు నా హక్కు’ నినాదంతో ఇంటింటికి తిరుగుతూ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు అనే ఆయుదమే కీలకమని ఆయన స్థానికులకు తెలియజేశారు. రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న కార్యక్రమానికి మద్దతు తెలిపాలని ఆయన కోరారు.