ASF: పేద ప్రజల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నారు. శనివారం సిర్పూర్(యు) మండలం పిట్టగూడ, కొత్త భీంగూడ గ్రామాల్లో ఆమె పర్యటించారు. ఆయా గ్రామస్థులతో సమావేశమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఉన్న సమస్యలను ప్రజా ప్రభుత్వం పరిష్కరిస్తుందని హమిచ్చారు.